Skip to main content

Posts

Showing posts from 2016
18వ తేది, ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత వైద్య పరీక్షలు.... నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు...నంద్యాల పట్టణం లోని విజయ daignostic సెంటర్ లో ఉచిత పరీక్షలు....ఈ నెల 18వ తేది, ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత పరీక్షలు నిర్వహించబడును. పూర్తి వివరాలకు...డి.శివరాం(బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్), విజయ డయగ్నోసిస్ సెంటర్, ఆర్ కే కలర్ ల్యాబ్ ఎదురుగా, జూమ్ స్టూడియో పక్కన, నంద్యాల.Cell:8008488553,9052524302ను సంప్రదించండి....

కరెన్సీ కష్టాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు తేది ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది....

  పాతనోట్లు  నవంబర్‌ 24 వరకు  ..  పెట్రోల్‌ బంకులు, ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లలో చెలామణి అవుతాయని ప్రకటించింది. నవంబర్‌ 14తో ముగుస్తున్న ఈ గడువును 24వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం నోట్ల మార్పిడి.. నగదు ఉపసంహరణలో కాస్త వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. * రూ.500, రూ.1000 పాతనోట్లను బ్యాంకులో మార్చుకునేందుకు పరిమితి రూ.4000 నుంచి రూ.4,500కు పెంచింది. *ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితి రోజుకు రూ.2000 నుంచి రూ.2,500కి పెంచింది. * బ్యాంకు కౌంటర్ల నుంచి ఒక వారంలో తీసుకోగలిగే నగదు పరిమితి రూ.20,000 నుంచి రూ.24,000కు పెంచింది. ఈ మొత్తాన్ని రోజుకు గరిష్ఠంగా రూ.10,000 చొప్పున తీసుకోవచ్చనే పరిమితి తొలగించింది. రోజుకు బ్యాంకుల్లో రూ.4500, ఏటీఎంలో రూ.2500 డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.