పాతనోట్లు నవంబర్ 24 వరకు .. పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లలో చెలామణి అవుతాయని ప్రకటించింది. నవంబర్ 14తో ముగుస్తున్న ఈ గడువును 24వ తేదీ వరకు పెంచుతూ కేంద్రం సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం నోట్ల మార్పిడి.. నగదు ఉపసంహరణలో కాస్త వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. * రూ.500, రూ.1000 పాతనోట్లను బ్యాంకులో మార్చుకునేందుకు పరిమితి రూ.4000 నుంచి రూ.4,500కు పెంచింది. *ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితి రోజుకు రూ.2000 నుంచి రూ.2,500కి పెంచింది. * బ్యాంకు కౌంటర్ల నుంచి ఒక వారంలో తీసుకోగలిగే నగదు పరిమితి రూ.20,000 నుంచి రూ.24,000కు పెంచింది. ఈ మొత్తాన్ని రోజుకు గరిష్ఠంగా రూ.10,000 చొప్పున తీసుకోవచ్చనే పరిమితి తొలగించింది. రోజుకు బ్యాంకుల్లో రూ.4500, ఏటీఎంలో రూ.2500 డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.